Back to Library

Appagimpabadina Raathri

Category: WorshipLanguage: TeluguKey: G

Romanisedi

Telugu

VERSE 1

అప్పగింపబడిన రాత్రి

చెప్ప సాగే శిష్యులతో (2)

చెప్పరాని దుఃఖముతో

తప్పదు నాకీ మరణమనెను (2) ||అప్పగింప||

VERSE 1

రొట్టె విరచి ప్రార్ధించి

నిట్టూర్పు విడచి దీన దేహం (2)

పట్టుదలతో నేనొచ్చుఁ వరకు

ఇట్టులనే భుజించుడనెను (2) ||అప్పగింప||

VERSE 1

ద్రాక్షా రసగి నేను చాపి

వీక్షించుడిదియే నా రక్తం (2)

రక్షణార్థం దీని త్రాగి

మోక్ష రాజ్యం చేరుడనెను (2) ||అప్పగింప||

VERSE 1

రాతివేత దూరాన

చేతులెత్తి ప్రభు మోకరించి (2)

నా తండ్రి నీ చిత్తమైతే

ఈ పాత్రన్ తీసి వేయుమనెను (2) ||అప్పగింప||

VERSE 1

ఇదిగో వచ్ఛే తుది ఘడియలు

హృదయ బాధ హెచ్చెను (2)

పదిలపరచు-నట్లు తండ్రి

మదిలో వదలక ప్రార్ధించుడనెను (2) ||అప్పగింప||

English Lyrics

Related Songs